Advertisement

అక్షరటుడే, ఇందూరు: జర్నలిస్ట్​ మల్లెపూల నరేంద్ర నిబద్ధతతో పనిచేసి.. జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని నుడా ఛైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్​క్లబ్​లో మల్లెపూల నరేంద్ర 34 వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. చిన్న వయసులోనే జర్నలిస్టు వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉన్న మల్లెపూల నరేంద్ర 1991 జనవరి 29న ముదక్​పల్లి వద్ద పోలీసులు, నక్సలైట్ల ఎదురు కాల్పులలో మృతి చెందడం బాధాకరమన్నారు. జర్నలిస్ట్​ వెల్ఫేర్ కమిటీకి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పోటీల్లో గెలిచిన జర్నలిస్టులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్​క్లబ్​ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, బైరి శేఖర్​, స్పోర్ట్స్ కమిటీ వ్యవస్థాపక సభ్యుడు సాంబయ్య, కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Medicover​ Hospital | మెడికవర్‌ ఆస్పత్రిలో అవగాహన శిబిరం