Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్: నూతనంగా ఏర్పాటైన మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. నిజాంసాగర్ మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అనిత రెడ్డి మహమ్మద్ నగర్ ఇన్ఛార్జి ఎంపీడీవోగా నియమితులయ్యారు. కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎంపీటీసీ స్థానాల సవరణ జాబితాను ప్రదర్శించారు. నిజాంసాగర్ ఎంపీడీవో గంగాధర్, కార్యాలయ సిబ్బంది విష్ణు తదితరులు ఉన్నారు.
Advertisement