Advertisement

అక్షర టుడే, వెబ్ డెస్క్ : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. UPI లావాదేవీల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 1 నుంచి UPI ఐడీలలో ప్రత్యేక అక్షరాలు ఉంటే అటువంటి వాటికి పేమెంట్స్ చేయలేరు. ఆల్ఫా-న్యూమరిక్ (A- to Z, 0- to 9) ఉన్న యూపీఐ IDలు మాత్రమే చెల్లుబాటు కానున్నాయి.

Advertisement

IMPS పరిమితి పెంపు

ప్రస్తుతమున్న రూ. 5 లక్షల పరిమితిని NPCI.. రూ. 10 లక్షలకు పెంచడం గమనార్హం. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి IMPS ద్వారా రోజుకు రూ.10 లక్షల వరకు బదిలీ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. లబ్ధిదారుని పేరును పేర్కొనకుండా రూ. 7 లక్షల వరకు తక్షణ బదిలీలు చేపట్టవచ్చు