Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్, మెడికల్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు దశరథ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ గణేష్‌ ఏజెన్సీ కింద పనిచేస్తున్న కార్మికులకు ఐదునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వేతనాలు చెల్లించి, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని కోరారు.

Advertisement