Advertisement
అక్షరటుడే, బిచ్కుంద: మద్నూర్ మండలానికి మరో రెండు ఎంపీటీసీ స్థానాలు పెంచాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జనాభా లెక్కల ప్రకారం మద్నూర్ మండలంలో అదనంగా రెండు ఎంపీటీసీ స్థానాలు పెంచాలన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు తుకారాం, సీనియర్ నాయకులు కృష్ణ పటేల్, వెంకట్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement