అక్షరటుడే, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే లగచర్ల గ్రామానికి రావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. లేదంటే తానే కొడంగల్ వస్తానన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో మీ గురువును, సోనియా గాంధీని’ అడగాలన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ప్రస్తుతం కొత్త పథకాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం కోసం మహిళలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.
Advertisement
Advertisement