అక్షరటుడే, వెబ్ డెస్క్: కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ కూడా చేసింది. ఇదే భేటీలో రాష్ట్రంలో నూతన గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఉజ్వల గ్యాస్ సిలిండర్ పైన మరో రూ .100 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవలే రూ.200 సబ్సిడీ ఇస్తూ నిర్ణయించగా మొత్తం సబ్సిడీ రూ.300కు పెరిగింది.