అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: అర్ధరాత్రి దుకాణాలు తెరిచిన ముగ్గురికి సెకండ్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ నూర్జహన్​ ఒక రోజు జైలు శిక్ష వేసినట్లు ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు. షేక్​ అబు (సవేరా హోటల్​, మాలపల్లి), సయ్యద్​ సమీర్​ (మిలాన్​ హోటల్​, ఖిల్లా రోడ్డు), మహ్మద్​ షాకీర్​ హుస్సేన్​ (స్నూకర్​ బిజినెస్​, బోధన్ ​రోడ్డు)కు జైలు శిక్ష విధించినట్లు వివరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపిన మరొకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.