అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో ఓ మహిళ(35), బాలుడి (8) మృతదేహాలను ఆదివారం గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న ఇంటి భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కుళ్లిపోయిన మృతదేహాలు బయటపడ్డాయి.
మృతదేహాలను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతులు ఎవరనే విషయమై తేలాల్సి ఉంది. హత్య చేసి ఇక్కడ వదిలేశారా? లేక ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
మహిళ, బాలుడి మృతదేహాలు లభ్యం..
Advertisement
Advertisement