అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను మే 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నట్లు సీఈవో బుధవారం తెలిపారు. 29న ఉదయం 11 గంటలకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మధ్యాహ్నం 2 గంటలకు విద్య, వైద్యం, మహిళా, శిశు సంక్షేమంపై సమావేశాలు జరుగనున్నాయి. అలాగే 30న ఉదయం 11 గంటలకు సాంఘిక సంక్షేమం, పనులు, ఆర్థిక, ప్రణాళికపై సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పేర్కొన్నారు.