Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా, ఫ్రాన్స్ పర్యటన ఖరారైంది. ఈ నెల 10న మోదీ ఫ్రాన్స్ వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారు. అనంతరం 12న అమెరికా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు మోదీ అక్కడ పర్యటిస్తారు. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక మోదీ తొలి పర్యటన కావడంతో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది.
Advertisement