Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: హైదరాబాద్ వైద్యులు అద్భుతం చేశారు. ఓ యువకుడికి కృత్రిమ పురుషాంగం అమర్చి కొత్త జీవితం ప్రసాదించారు. సోమాలియాకు చెందిన ఓ యువకుడికి నాలుగేళ్ల వయస్సులో సున్తీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో పురుషాంగం తొలగించారు. మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ల్యాబ్లో తయారు చేసిన పురుషాంగాన్ని ఏడాది క్రితం ఆ యువకుడికి అమర్చారు. ప్రస్తుతం ఆ యువకుడికి అంగస్తంభన కోసం తాజాగా పిలైన్ ఇంప్లాంట్ చేసినట్లు వైద్యులు తెలిపారు. యువకుడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.
Advertisement