Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్‌ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యువత ఎమ్మెల్సీ గెలుపు కోసం కృషి చేస్తారన్నారు. దీంతో ఆయన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement