అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని పలు లేఅవుట్‌ వెంచర్లలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పట్టణ కౌన్సిలర్లు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కోసం వదిలేసిన 10 శాతం లేఅవుట్‌ స్థలాలను వదలకుండానే గతంలో పనిచేసిన అధికారులు వెంచర్లకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే లేఅవుట్‌ ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయని, భవన నిర్మాణాల అనుమతుల్లో అవకతవకలు జరిగాయని వివరించారు. అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుర ఛైర్మన్‌ జంగం గంగాధర్‌, కౌన్సిలర్లు నందకిషోర్‌, శ్రీనివాస్‌, రవీందర్‌ రెడ్డి, నర్సుగొండ, మోతిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement