Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. ఎన్నికలకు ఇప్పటివరకు 85 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు వేశారు. పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి నేడు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్లు వేయనున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  HMDA : హెచ్ఎండీఏ ప‌రిధి పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. మొత్తం ఎన్ని జిల్లాలు విలీనం కానున్నాయంటే..!

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు.

Advertisement