అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ) జనసేనగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరాటే రాజు తనతో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తు చేసుకున్నారు. అనంతరం జై జనసేన అని నినదించారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని, తనకు ఎంతో సంతోషంగా ఉందని చిరు అన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి 2008లో పీఆర్పీని స్థాపించిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఆయన తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు.
ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారింది
Advertisement
Advertisement