Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: బస్సు కోసం నిరీక్షిస్తున్న ఇద్దరు మహిళలను రెడ్​మిక్స్​ లారీ ఢీకొంది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా షామీర్​పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవాని తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న అంతాయిపల్లి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

Advertisement