Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్ లో విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలతో ఎలా మెలగాలి తదితర విషయాలపై ఎస్పీ సింధుశర్మ ఆదేశాలతో సీనియర్ అధికారులతో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో సేవలందిస్తూ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు భరోసా ఇవ్వాలని చెప్పారు.
Advertisement