Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: ట్రైన్​ డోర్లు ఓపెన్​ చేయకపోవడంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టిన ఘటన బీహార్​లో చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ నిండిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బీహార్​లోని మదుబని స్టేషన్​కు వచ్చిన స్వతంత్ర సేనాని ఎక్స్​ప్రెస్​ ట్రెయిన్​లో కూడా స్థలం లేకపోవడంతో అధికారులు డోర్లు ఓపెన్​ చేయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఏసీ కోచ్​ అద్దాలు పగులకొట్టి లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు.

Advertisement