అక్షరటుడే, ఇందూరు: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లాకు చెందిన నారాయణ కళాశాల విద్యార్థిని పంచ్ మహల్కర్ రియా ఉత్తమ పర్సంటైల్ సాధించింది. కళాశాల ఏజీఎం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 80 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 20 మందికి పైగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు తెలిపారు. రియా 99.83 శాతం సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ పర్సంటేజ్ సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవి గౌడ్, ఏవో శేఖర్, ప్రసాద్ జీఎం శ్రీనివాస్, విద్యార్థిని రియా తల్లిదండ్రులు నీలిమా, డాక్టర్ పంచ్ మహల్కర్ ఆనంద్ పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్‌లో నారాయణ విద్యార్థి ప్రతిభ
Advertisement
Advertisement