అక్షరటుడే, వెబ్డెస్క్: నిజామాబాద్ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ సోమవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మంగళవారం హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం.