Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకు నిబంధనల మేరకు కమిటీ ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి కోసం నిబంధనలు మారబోవన్నారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. ‘రాజాసింగ్ కు ఇబ్బంది కలిగి ఉండవచ్చు.. ఆయన బాధపడి ఉండొచ్చు.. నేను కాదనను.. ఆయన ఓ మంచి నాయకుడు. ధర్మం కోసం, పార్టీ కోసం కష్టపడే నేత. కొందరు రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడి ఉండవచ్చు..’ అని పేర్కొన్నారు.
Advertisement