Advertisement
అక్షరటుడే, ఇందూరు: సేవాలాల్ మహరాజ్ బంజారా జాతిని ఏకం చేసిన మహనీయుడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో శనివారం ఇంద్రపూర్లోని సంతోష్ నగర్లో సేవాలాల్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షణలో సేవాలాల్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సుందర్ సింగ్ రాథోడ్, నాగరాజు, నారాయణ, ప్రభాకర్, కిరణ్, సాయినాథ్ పాల్గొన్నారు.
Advertisement