Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: చైల్డ్ హుడ్ కేన్సర్ పై అవగాహన కోసం పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు పద్మపాని సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. ఆర్కే విద్యాసంస్థలు, లిటిల్ స్కాలర్స్ సహకారంతో మార్చి 2న స్టేట్ లెవల్ కామారెడ్డి హాఫ్ మారథాన్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 5 గంటలకు స్టేడియం నుంచి రాజంపేట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు వెళ్లి తిరిగి ఇందిరాగాంధీ వరకు 25 కి.మీ., 5:30 గంటలకు స్టేడియం నుంచి హౌసింగ్ బోర్డు ఎస్టీ హాస్టల్ తిరిగి స్టేడియం వరకు 10 కి.మీ, 6 గంటలకు స్టేడియం నుంచి నిజాంసాగర్ చౌరస్తా అక్కడి నుంచి స్టేడియం వరకు 5 కి.మీ, 6.30 గంటలకు స్టేడియం నుంచి బస్టాండ్ వరకు మారథాన్ ఉంటుందన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులు ఉంటాయన్నారు. సమావేశంలో లిటిల్ స్కాలర్స్ డీన్ ప్రేమ్ సింగ్, అకడమిక్ హెడ్ ఇంతియాజ్, కోచ్ శివ, ఆర్కే కళాశాల లెక్చరర్ నవీన్ పాల్గొన్నారు.

Advertisement