అక్షరటుడే ఇందూరు: నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానంగా తిరుగుతున్న బోధన్ పట్టణానికి చెందిన శ్రీధర్ ను పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా.. రెండు ల్యాప్ టాప్ లు, ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ప్రయాణికుల నుంచి దొంగతనం చేసినట్లు తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.