అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని ముబారక్ నగర్ లో ఓ కారు డ్రైవర్ భీభత్సం సృష్టించాడు. సోమవారం రాత్రి మద్యం మత్తులో హ్యుందాయ్ ఐ 10 కారు నడిపిన వ్యక్తి ప్రమాదానికి కారణమయ్యాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న కూరగాయల దుకాణంలోకి దూసుకెళ్లగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో నాలుగు బైకులు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.