అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని డీఈవో దుర్గాప్రసాద్ సూచించారు. గురువారం నవీపేట మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపించకుండా చూడాలని ఇంజనీరింగ్ విభాగం ఏఈలను ఆదేశించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు, ఇంజనీర్లు ఉన్నారు.