అక్షరటుడే, వెబ్డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అహుజ తన భార్యతో విడిపోనున్నారు. గోవింద, సునీత(govinda Sunitha divorce) దంపతులు తమ 37 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా వేర్వేరుగా ఉంటున్న వారు అధికారింగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసినట్లు సమాచారం.
ఎందుకు విడిపోతున్నారంటే..
గోవింద, సునిత(Actor govinda wife Sunitha) 37 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. అయితే నటుడు గోవింద మరో అమ్మాయితో చనువుగా ఉండటంతోనే తాము విడిపోతున్నట్లు సునిత తెలిపారు. గోవింద 30 ఏళ్ల ఓ మరాఠ నటితో సన్నిహితంగా మెలగడమే తమ విడాకులకు కారణమని పేర్కొన్నారు. అంతేగాకుండా గోవింద తన వస్త్రధారణ విషయంలో ఇబ్బంది పెట్టేవాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఎప్పుడు చీర కట్టుకోవాలని గోవింద చెప్పేవాడని, అందుకే అతనంటే తనకు నచ్చడని చెప్పారు.
వయసు అయిపోవడంతో..
యంగ్ ఏజీలో హీరోగా నటిస్తున్న సమయంలో గోవిందా ఇతరులతో అఫైర్ పెట్టుకుంటాడని తాను ఆలోచించలేదన్నారు. సినిమాల బిజీలో అఫైర్ల గురించి ఆలోచించే సమయం ఆయనకు ఉండేది కాదన్నారు. అయితే ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన గోవింద ఖాళీగా ఉంటున్నాడని పేర్కొన్నారు. దీంతో ఎవరితోనైనా అఫైర్ పెట్టుకున్నాడేమోనని వ్యాఖ్యానించారు.