అక్షరటుడే, వెబ్డెస్క్: నిర్మల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ సివిల్ జడ్జి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
ఏళ్లుగా నిరీక్షణ
నిర్మల్ జిల్లాలోని పలువురు ఎస్సారెస్పీ, గడ్డన్న జలాశయం నిర్మాణం సమయంలో భూములు కోల్పోయారు. పరిహారం కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. బాధితులకు కలెక్టర్ రూ.6.79 కోట్లు, ఆర్డీవో కార్యాలయం రూ.1.45 కోట్ల పరిహారం బకాయిలు చెల్లించాల్సి ఉంది. అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జడ్జి కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని తీర్పు చెప్పారు.