అక్షరటుడే, వెబ్​డెస్క్: ఎస్​ఎల్​బీసీ (SLBC) ప్రమాదంపై బీఆర్​ఎస్​ ఓవరాక్షన్​ చేస్తోందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. టన్నెల్​లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లో కార్మికుల ఆచూకీ కనుగొంటామని పేర్కొన్నారు.

Advertisement

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రస్తుతం ఎస్​ఎల్​బీసీ ప్రమాదం జరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నామని వివరించారు. బీఆర్​ఎస్​ హయాంలో శ్రీశైలం పవర్​ ప్లాంట్​ ప్రమాదంలో ఆరుగురు చనిపోతే కేసీఆర్​ పరామర్శించలేదని విమర్శించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే కనీసం వెళ్లలేదన్నారు. ఇప్పుడు మాత్రం బీఆర్​ఎస్​ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Congress Govt | ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఆచూకీపై ఉత్కంఠ

ఎస్​ఎల్​బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి ఆరు రోజులైనా 8 మంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. వారిని చేరుకునే మార్గంలో బురద ఉండడంతో దానిని ప్రస్తుతం తొలగిస్తున్నారు. సహాయ చర్యల్లో మార్కోస్‌ కమాండోలు పాల్గొంటున్నారు.

Advertisement