అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: భార్యభర్తల మధ్య తగదా జరగడంతో మనస్థాపానికి గురై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. వినాయక్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ అన్వర్‌కు ఇంట్లో భార్యతో గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో టౌన్‌ ఎస్సై సంజీవ్‌ తెలిపారు.