Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లో ఆశావర్కర్లకు ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. వారికి గ్రాడ్యూటీ చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. దీంతో ఒక్కో కార్యకర్తకు రూ. లక్షన్నర వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే జీతంతో పాటు 180రోజుల మెటర్నిటీ లీవ్​కు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పదవీవిరమణ వయస్సు కూడా 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీలోని 42,752 మంది ఆశాకార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Job Mela : పది పాస్ అయ్యారా? నెలకు 20 వేలు ఇస్తారు.. నో ఎగ్జామ్.. డైరెక్ట్ జాబ్.. మీకోసమే ఈ జాబ్ మేళా