Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్​ మస్క్​ 14వ సారి తండ్రి అయ్యారు. మస్క్​ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తున్న శివన్ జిలిస్‌తో కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఈ విషయాన్ని మస్క్​ భార్య ‘ఎక్స్​’ వేదికగా వెల్లడించారు. కాగా.. మస్క్​కు ఇప్పటికే మరో 13 మంది పిల్లలు ఉన్నారు. అయితే మస్క్​, శివన్ జిలిస్‌ దంపతులకు కవలలు(స్టైడర్​, అజూర్​)తో పాటు ఏడాది వయస్సు పాప ఆర్కాడియా ఉన్నారు.

సోషల్​ మీడియాలో చర్చ

మస్క్​ 14వ సారి తండ్రి కావడంపై సోషల్​ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో జనాభా క్షీణిస్తున్న నేపథ్యంలో మస్క్​ సంతానోత్పత్తికి ప్రాముఖ్యత ఇస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. మస్క్​ మొదటి భార్యకు ఐదుగురు పిల్లలు ఉన్నారు.

Advertisement