Advertisement

అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో బకాయిలు ఉన్న ఆస్తిపన్ను క్రమం తప్పకుండా చెల్లించాలని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పెండింగ్ లో ఉన్న బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలు దుకాణాల యజమానులు సుమారు రూ. 30 లక్షలు ఆస్తి పన్ను చెల్లించారు. అంతకుముందు హోటల్ స్వాగత్​లో ఆహార నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  PROPERTY TAX | ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలి

పన్ను చెల్లించిన వారి వివరాలు..

వాసవి డిజిటల్​ ఫోటో స్టూడియో రూ. 2,33,730, భవానీ డెంటల్​ మల్టీ స్పెషాలిటీ కేర్​ ఆస్పత్రి రూ. 7,42,552, ప్రియాంక స్కిన్​ క్లినిక్​ రూ. 12,96,092, హైటెక్​ మోబైల్​ షాప్​ రూ. 5,00,000, కేర్​ డిగ్రీ కళాశాల రూ. 1,91,340 పన్ను చెల్లించారు.

Advertisement