Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​, మంత్రి నారా లోకేశ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయనను గచ్చిబౌలిలో అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె ఠాణాకు తరలించారు. జ్యూడీషియల్​ రిమాండ్​లో భాగంగా సబ్​జైలులో ఉన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు రాజంపేట ప్రభుత్వాస్పత్రికి పోసానిని తరలించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Posani Krishna Murali : పోసాని కృష్ణ ముర‌ళికి పెద్ద ఉప‌శ‌మ‌నం.. బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

బెయిల్​ పిటిషన్​ వాయిదా

పోసాని కృష్ణమురళి బెయిల్​ పిటిషన్​ సోమవారానికి వాయిదా పడింది. అయితే ఆ రోజు ఒకవేళ పోసానికి బెయిల్​ వస్తే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రైల్వే కోడూరు పోలీసులు సోమవారం పీటీ వారెంట్​ జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement