Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NIZAMABAD| నగర శివారులోని సారంగపూర్​లో శనివారం గ్యాస్​ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సారంగపూర్​ సమీపంలో గ్యాస్​ సిలిండర్ల లోడ్​తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే గుంతలో పడింది. అయితే లారీలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం సంబంధిత సిలిండర్ల కంపెనీ వ్యక్తులు వచ్చి సిలిండర్లను ఇతర వాహనాల్లో డంప్​ చేసి తీసుకెళ్లారు.

Advertisement