అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pavan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై లక్ష్మీ పార్వతి laxmi parvathi సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి Posani Krishna Murali అరెస్ట్‌పై ఆమె మాట్లాడారు. పోసానిని అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌కు ఎలాగో బుద్ధి లేదని, పవన్ కల్యాణ్‌కు ఉందనుకుంటే ఇలా చేయడం సరికాదన్నారు.
Pavan Kalyan : అవార్డు తీసుకోకపోవడంతో..
నంది అవార్డు Nandi Award తీసుకోకపోవడంతో పోసానిని అరెస్ట్ చేశారని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు గతంలో ఎంతోమంది అవార్డులను తిరస్కరించారని ఆమె గుర్తు చేశారు. ఒకే వర్గానికి చెందిన వారికి అవార్డులు ఇస్తున్నారని, ఐదేళ్ల క్రితం పోసాని నంది అవార్డు తీసుకోకపోవడంతో ఇప్పుడు అరెస్ట్ చేశారన్నారు.
Pavan Kalyan : అనారోగ్యంతో ఇబ్బంది..
పోసాని కృష్ణమురళి ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని ఆమె వ్యాఖ్యనించారు. ఆరోగ్యం బాగా లేని వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనకు చాలా ఆపరేషన్లు అయ్యాయన్నారు.
Pavan Kalyan : పోసానికి అస్వస్థత
జైలులో ఉన్న పోసాని శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అధికారులు రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కడప రిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.