Kiara Advani : కియారా ప్రెగ్నెన్సీతో ఎఫెక్ట్ అయ్యే సినిమాలు ?

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kiara Advani : బాలీవుడ్ స్టార్ క‌పుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా siddary malhotra త్వ‌ర‌లో ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో విషయాన్ని పంచుకున్నారు. ఈ వార్తల తర్వాత, అభిమానులు, సహనటులు, తోటి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

కియారా ప్రెగ్నెన్సీతో ఆమె నటిస్తున్న సినిమాలపై ఊహాగానాలు తలెత్తాయి. ఆమె ప్రస్తుతం “టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్”లో నటిస్తోంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో కేజీఎఫ్ KGF స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం ఇది. ఇందులో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియాతో పాటు కియారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె ఇప్పటికే యష్‌తో ఒక పాట పూర్తి చేసిందని, ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగే అవకాశం ఉందని సమాచారం. అయితే కియారా రణవీర్ సింగ్ డాన్ 3 నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఆమె ప్రభాస్ Prabhash రాబోయే చిత్రం స్పిరిట్​ Spiritలో నటిస్తుందని పుకార్లు వచ్చాయి, కానీ ఇప్పుడు ఆమె తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement