అక్షరటుడే, ఇందూరు: Self-confidence : ఆటపాటలతో ప్రజల్లో దేశభక్తి పెంపొందించడమే సంఘ శాఖ ప్రధాన ఉద్దేశమని కృష్ణశాస్త్రి విజయ భాస్కర్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి పద్మశాలి హైస్కూల్‌లో నిర్వహించిన పరశురామ ప్రభాత్ శాఖ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తల వికాసానికి సంఘ శాఖ తోడ్పాటు అందిస్తుందని, శాఖతో స్వయం సేవకుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, జట్టు భావన ఏర్పడతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సంఘ శాఖల ద్వారా హిందూ సమాజం చైతన్యవంతమవుతుందన్నారు. కార్యక్రమంలో అరుగుల సత్యం, సుమిత్, వెంకటేష్, భద్రయ్య, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
Self-confidence | శాఖతో సంఘ సేవకుల్లో ఆత్మవిశ్వాసం
Advertisement
Advertisement