సైన్స్‌ఫెయిర్‌లో అచ్చంపేట విద్యార్థుల ప్రతిభ
సైన్స్‌ఫెయిర్‌లో అచ్చంపేట విద్యార్థుల ప్రతిభ
Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్‌: మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు సైన్స్‌ఫెయిర్‌లో ఉత్తమ ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా ప్రశంసలు అందుకున్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు రైల్వే ఆక్సిడెంట్‌ నిర్మూలన–ఇన్నోవేషన్‌ చాలెంజెస్‌ పై ప్రయోగం ప్రదర్శించారు. దీంతో స్టేట్‌ లెవల్‌ రోబోటిక్స్‌ ఇన్‌ అకాడమిక్స్‌ ఆధ్వర్యంలో ట్రోఫీ, షీల్డ్‌ అందజేశారు. విద్యార్థులతో పాటు గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయురాలు చందనను పాఠశాల ప్రిన్సిపాల్‌ కార్తీక సంధ్య, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement