అక్షరటుడే, ఆర్మూర్: Armoor : మున్సిపాలిటీలో ఇంటి నంబర్ల కేటాయింపులో పెద్దఎత్తున అవినీతి జరిగిన విషయం తెలిసిందే. ఈ అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ విషయమై సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కార్యాలయం నుంచి విచారణ కోసం లెటర్ పంపించారన్నారు. కొన్ని ఇంటి నంబర్లను తిరస్కరించామని, ఎలాంటి కట్టడాలు లేవని అధికారులు చెప్పారన్నారు. అలాంటప్పుడు మిగితా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
సదరు ఇంటి నంబర్లపై అక్రమ కట్టడాలు ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సత్వరమే మున్సిపల్ అధికారులు స్పందించాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు జీవీ నరసింహ రెడ్డి, బాలు, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, శ్రీనివాస్, ఉదయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.