అక్షరటుడే, కామారెడ్డి: అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది బుధవారం మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు జరిపారు. దాడుల్లో సోమారంపేటకు చెందిన చిట్టవేని నర్సయ్య ఇంట్లో 3 లీటర్ల నాటుసారా లభ్యమైంది. మాలోత్ వీణ ఇంట్లో మరో 5 లీటర్ల సారా పట్టుబడింది. వీరిద్దరితో పాటు గుగులోత్ దేవేందర్ పై కేసు నమోదు చేశారు. సీఐ విజయ్ కుమార్, ఎస్సై విక్రమ్, సిద్ధిరాములు, ఆంజనేయులు, రమ, శ్రీరాగ పాల్గొన్నారు.