అక్షరటుడే, ఆర్మూర్ : LRS Scheme : ఎల్‌ఆర్‌ఎస్‌పై 25శాతం రాయితీ అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. రిబేట్ సదుపాయం కింద రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు.
మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్చి 31 లోపు గడువు ఉందన్నారు. 2020లో రూ.వెయ్యి చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు తదుపరి ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.
నిషేధిత భూములు కానివి, వాటర్ బాడీస్‌కి 200 మీటర్ల వెలుపల ఉన్న ప్లాట్లకి సంబంధించి దరఖాస్తుదారులకు ఇది వర్తిస్తుందన్నారు. అలాగే హెల్ప్ డెస్క్ లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.