అక్షరటుడే, కోటగిరి: ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మండలాల నూతన కమిటీలను సోమవారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి వెంకట స్వామి, జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, సహాయ కార్యదర్శి పోచిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోటగిరి, పోతంగల్ మండల కమిటీలను ఎన్నుకున్నారు.
కోటగిరి మండలాధ్యక్షుడిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, జలయ్య, ప్రధాన కార్యదర్శిగా రేని సాయిలును ఎన్నుకోగా, పోతంగల్ అధ్యక్షుడిగా యాదవ్‌రావు, ఉపాధ్యక్షులుగా సాయిలు, అబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా సంగయ్యను ఎన్నుకున్నారు. ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయ్, నితిన్, రవీందర్, రాజేష్, సంజీవ్, బాలయ్య సురేష్, తదితరులు పాల్గొన్నారు.