అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Arvind : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లకు అడ్డుపడుతున్నారని అనడం సరికాదన్నారు. ఎలా అడ్డు పడుతున్నారో చెప్పాలన్నారు. ఇలా అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఆయా ప్రాజెక్ట్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు, భూసేకరణ చేపట్టినా కూడా కేంద్రం ఏం ఇవ్వడం లేదో చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. కావాలంటే తాను కిషన్‌రెడ్డిని తీసుకొని ప్రధాని వద్దకు వస్తానని, సీఎం కూడా వస్తే అక్కడే చర్చిద్దామని సవాల్ విసిరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రధాని మోదీ సమానంగా చూస్తున్నారని తెలిపారు.
MP Arvind : ప్రజలు తిడుతున్నారు
అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ చేసిన వాగ్ధానాలను ప్రస్తుతం అమలు చేయడం లేదన్నారు. దీంతో ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని తిడుతున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తయారవుతున్నారని చెప్పారు. హామీల అమలు గురించి చెప్పకుండా, సీఎం రేవంత్‌రెడ్డి అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.