అక్షరటుడే, హైదరాబాద్: MLC : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలో మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలు.. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానం, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో మరొకటి, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం ప్రాంతంలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం సహా మూడు చోట్ల ఎన్నికలు జరిగాయి.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు.
MLC : నల్లగొండ..
13 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యాక.. ఓట్లు అందుకున్న వివరాల ఈ విధంగా ఉన్నాయి..
శ్రీపాల్ రెడ్డి – 6,165
అలుగుబెల్లి నర్సిరెడ్డి – 4,946
హర్షవర్ధన్ రెడ్డి – 4,596
పూల రవీందర్ – 3,249
పులి సరోత్తం రెడ్డి – 2,394
సుందర్ రాజు : 2,141 ఓట్లు
MLC : కరీంనగర్ జిల్లా..
ఉపాధ్యాయ స్థానంలో..
మొదటి రౌండ్లో…
మల్కా కొమరయ్య – 7,600
వంగ మహేందర్ రెడ్డి – 5,200
MLC : తలనొప్పిగా మారిన చెల్లని ఓట్లు..
గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెల్లిన ఓట్ల విభజన ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులకు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది. ఈ క్రమంలోనే కౌంటింగ్‌కు ఆలస్యమవుతున్నట్టు చెబుతున్నారు. అవగాహన లోపంతో పట్టభద్రులు అత్యధికంగా చెల్లని ఓట్లు వస్తున్నట్లు పేర్కొంటున్నారు.
MLC : వరస్ట్ ప్రభుత్వం అంటూ..
వరస్ట్ ప్రభుత్వం అంటూ మరికొందరు, రైతు బంధు రాలేదని కొందరు, బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేసిన ఇంకొందరు, రైట్ గుర్తు పెట్టి కొందరు.. ఇలా ఇష్టారీతిన గ్రాడ్యుయేట్ ఓటర్లు రాసుకుంటూ పోయి, విలువైన ఓట్లను చెల్లకుండా చేశారు.
MLC : ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ
చెల్లని ఓట్లలో 01, 02 అని రాసిన ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ విన్నవించారు.