అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Turmeric Board : జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా భవాని నియమితులైన విషయం తెలిసిందే. కాగా.. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్లో జేఎంకేపీఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమను బోర్డు ఛైర్మన్ గంగారెడ్డితో కలిసి సందర్శించారు. రూ.3 కోట్ల వ్యయంతో 600లకు పైగా రైతులు కలిసి ఏర్పాటు చేసుకోవడంపై వారిని అభినందించారు.
అలాగే కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని సైతం సందర్శించారు. వారి వెంట బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతి రెడ్డి, శాస్త్రవేత్త మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.