అక్షరటుడే, వెబ్డెస్క్: SLBC : ఎస్ఎల్బీసీ SLBC ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. SLBC టన్నెల్ పనులు GSI అధికారుల పర్మిషన్, నిపుణుల సలహాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మొదలుపెట్టిందని ఆయన ప్రశ్నించారు. SLBCలో నీళ్లు వస్తున్నాయని 2019-20లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే GSI, నిపుణుల సలహాలు తీసుకోకుండా పనులు మొదలు పెట్టిందన్నారు. నాలుగేళ్ల తర్వాత పనుల ఎస్టిమేట్ పెంచారని ఆరోపించారు. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు.
SLBC : అడ్డంగా రెండు వాగుల ప్రవాహం
SLBC మీద రెండు వాగులు ప్రవహిస్తున్నాయని పాయల్ శంకర్ తెలిపారు. ఆ వాగుల నీళ్లు టన్నెల్లో ఊరుతున్నాయని గత ప్రభుత్వం పనులు ఆపేస్తే.. 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి సలహాలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించి, అమాయకుల ప్రాణాలు హరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతోనే ప్రమాదం జరిగిందన్నారు.
SLBC : కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ సొరంగంలో కార్మికుల మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం టన్నెల్ వద్ద సహాయక చర్యలను సీఎం రేవంత్రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. కాగా.. ఇప్పటి వరకు మృతదేహాల వద్దకు రెస్క్యూ సిబ్బంది చేరుకోలేకపోయారు.