Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఇండస్ట్రీలో యువ హీరో దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకచోట చిరంజీవిని చూసి స్పూర్తి పొందిన వారే. ప్రస్తుత జనరేషన్ లో అలా కల్ట్ చిరంజీవి ఫ్యాన్స్ గా కనిపించే ఇద్దరు దర్శకులు చిరంజీవి ఫోటో ఎదురుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న దర్శకులు ఎవరు అంటే ఒకరు యానిమల్ మేకర్ సందీప్ వంగ అయితే మరొకరు ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు.

అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సందీప్ వంగ సెన్సేషన్ గా మారాడు. మరోపక్క ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టి రెండో సినిమాతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు బుచ్చి బాబు సన. ఈ ఇద్దరు స్వతహాగా మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు అవ్వడం విశేషం. ఇక సందీప్ వంగ ఆఫీస్ లో చిరంజీవి ఆరాధన సినిమాలోని చిరు ఫోటో ఉంటుందని తెలిసిందే.

Chiranjeevi : చిరంజీవి అంటే ఎంత అభిమానమో..

ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గర సందీప్ వంగ, బుచ్చి బాబు ఇద్దరు కూడా ఫోటో దిగారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టస్ చిరంజీవి అంటే ఎంత అభిమానమో చూపించేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ వంగ అయితే తన ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కడో ఒకచోట మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూనే ఉంటాడు. తనకు సినిమాల మీద ఈ మ్యాడ్ నెస్ ఏర్పడటానికి చిరంజీవే ఒక కారణం అనిపించేలా చేస్తున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Ram Charan | ఆట కూలీగా రామ్ చ‌ర‌ణ్.. ఆర్సీ 16 కథ లీక్..!

ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఐతే వీరాభిమానులైన వీరిద్దరు చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తే అదిరిపోతుందని అనుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ అయిన వీరు వారి సినిమాలతో టాలీవుడ్ రేంజ్ పెంచుతూ ఆడియన్స్ ని ఖుషి చేస్తున్నారు. సందీప్ వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక బుచ్చి బాబు చరణ్ తో చేస్తున్న సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది.

Advertisement