DIL RAJU : పైరసీని అరికట్టేందుకు ఉద్యమం చేద్దాం : దిల్​రాజు
DIL RAJU : పైరసీని అరికట్టేందుకు ఉద్యమం చేద్దాం : దిల్​రాజు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్:​ DIL RAJU : సినిమా రంగానికి పైరసీ పెనుభూతంగా మారిందని.. దీనిని అరికట్టాలంటే ఓ ఉద్యమమే రావాలని తెలంగాణ ఫిల్మ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ దిల్​రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో పైరసీ కారణంగా నిర్మాణ రంగం కుదేలైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వందల కోట్లలో పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు పైరసీ కారణంగా నష్టాలపాలై నడిరోడ్డుపై నిలబడుతున్నారన్నారు.

DIL RAJU : నిర్మాతలంతా కలిసి రావాలి

పైరసీని కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని నిర్మాతలంతా ఏకతాటిపైకి రావాలని దిల్​రాజు స్పష్టం చేశారు. అయితే పైరసీ అడ్డుకట్టకు మార్గం సుగమమవుతుందన్నారు. దీనికి సంబంధించి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రూ.కోట్లలో పెట్టిన పెట్టుబడులు పైరసీ కారణంగా బూడిదలో పోసినట్లవుతుందని.. నిర్మాతలంతా కలిసి రావాలని దిల్​రాజు పిలుపునిచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి :  gaddar awards | గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం.. విధి విధానాలివే..

DIL RAJU : ఎఫ్​డీసీ ఛైర్మన్​గా లీడ్​చేస్తా..

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా విడుదల కాగానే రెండు మూడు రోజుల్లోనే పైరసీ వచ్చేస్తోందని.. దీని వెనక పెద్ద మాఫియానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నిర్మాతలంతా ముందుకొస్తే.. తాను లీడ్​ చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Advertisement